‘కిక్’ సినిమాలో మాస్ మహారాజ రవితేజతో కలిసి మెంటల్ పేషెంట్ అయిన ఆలి డాక్టర్ వేషంలో చేసిన అల్లరిని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ఇప్పుడు మన డాక్టర్ ఆలి డాక్టరేట్ అందుకున్నాక మరోసారి డాక్టర్ పాత్రను పోషించనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న ‘బలుపు’ సినిమాలో ఆలి డాక్టర్ సావిత్రి (ఎ మేల్/ ఫిమేల్ డాక్టర్) పాత్రను పోషిస్తున్నాడు. మరోసారి ఈ ద్వయం మనల్ని కడుపుబ్బ నవ్వించడానికి సిద్ధమయ్యారు. శృతి హాసన్ ఈ సినిమాలో పూర్తిస్థాయి గ్లామర్ పాత్ర పోషించనుంది. అంజలి రెండో హీరోయిన్. థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం పి.వి.పి సినిమా బ్యానర్ పై భారీ బడ్జెట్ లో రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఈ నెల 28న విడుదలకానుంది.