‘డ్యూడ్’ ఓటీటీ విడుదల తేదీ అదే !

ప్రదీప్ రంగనాథన్ తాజా హిట్ చిత్రం డ్యూడ్. దీపావళి కానుకగా థియేటర్స్ లో అలరించడానికి వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రావడానికి రెడీగా ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం నవంబర్ 14, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ వార్త నిజమే అని టాక్. అన్నట్టు ఈ సూపర్‌హిట్ చిత్రంలో మమితా బైజు (ప్రేమలు ఫేమ్) కథానాయికగా నటించింది.

కాగా ఈ చిత్రం రెండవ వారంలోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరో హిట్ గా కోలీవుడ్ లో అందుకున్నారు. తమిళ సీనియర్ హీరో ఆర్. శరత్‌కుమార్ ఆసక్తికరమైన పాత్రను పోషించగా, నేహా శెట్టి ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు.

Exit mobile version