సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీ లాభాల బాట పట్టడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
తాజాగా ఈ చిత్రం అందుకున్న భారీ విజయాన్ని సెలబ్రెట్ చేసుకునేందుకు ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ మీట్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ డిస్ట్రిబ్యూటర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక సినిమా సక్సె్స్ అయితే ప్రేక్షకులే తమకు లాభాలను ఇస్తారని.. అంతేగాని.. డిస్ట్రిబ్యూటర్స్ అబద్ధం ఆడినా.. నిర్మాత అబద్ధం ఆడినా.. మీడియా అబద్ధం ఆడినా.. ప్రేక్షకులు నమ్మడం లేదని ఆయన అన్నారు.
భారీ ఫిగర్స్‌తో పోస్టర్స్ వేస్తుంటే జనం నవ్వుకుంటున్నారని సదరు డిస్ట్రిబ్యూటర్ కామెంట్ చేశారు. దీంతో మీడియా కూడా ఆయన చేసిన కామెంట్స్‌ను అంగీకరించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.