‘మదరాసి’ పై శంకర్ రివ్యూ!

Madhraasi

లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన చిత్రాల్లో కోలీవుడ్ సినిమా “మదరాసి” కూడా ఒకటి. దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ అలాగే శివ కార్తికేయన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ యాక్షన్ చిత్రం బిలో యావరేజ్ టాక్ ని ఆడియెన్స్ నుంచి సొంతం చేసుకుంది. అయితే తమిళనాట డీసెంట్ బుకింగ్స్ లోనే ఉన్న ఈ సినిమాపై మావెరిక్ దర్శకుడు శంకర్ తన రివ్యూ చెప్పడం జరిగింది.

మదరాసి చిత్రం థియేటర్స్ లో ఒక ఎంజాయ్ చేసే కమర్షియల్ చిత్రం అని శంకర్ అంటున్నారు. మురుగదాస్ అన్ని ఎలిమెంట్స్ ని బ్రిలియంట్ గా కలిపారు అని శివ కార్తికేయన్ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా భిన్నంగా ఉందని దానిని అతడు అద్భుతంగా ఫుల్ చేసాడని అంటున్నారు. అలాగే అనిరుద్ సంగీతం కీలకంగా అనిపిస్తే విద్యుత్ జమ్వాల్ వావ్ అనిపించేలా ఉన్నాడని శంకర్ ఈ సినిమా విషయంలో ఎగ్జైట్ అవుతూ తన రివ్యూ షేర్ చేసుకున్నారు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది.

Exit mobile version