పూరి గారి మార్క్ ఈ సినిమాలో ఉండదు – శివ

పూరి గారి మార్క్ ఈ సినిమాలో ఉండదు – శివ

Published on Feb 19, 2014 5:00 PM IST

Na-Rakumarudu
‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర హీరోగా, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం రీతు వర్మ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘నా రాకుమారుడు’. పూరి జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ పనిచేసిన సత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ శుక్రవారం అనగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్య, హీరోయిన్ రీతు వర్మ మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు.

మొదటి సారి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేసారు. ఆ అనుభవం ఎలా ఉందని? అడిగితే రీతు వర్మ సమాధానమిస్తూ ‘ నేను మొదట సైన్ చేసింది ‘నా రాకుమారుడు’ కానీ ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ముందు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు బిందు. చాలా బాబ్లీగా ఉండే అల్లరి పిల్ల. ఒక సందర్భం తనని పూర్తిగా మార్చేస్తుంది. షూటింగ్ టైంలో నవీన్ చంద్ర, డైరెక్టర్ శివ నాకు బాగా హెల్ప్ చెయ్యడంతో నా పాత్ర బాగా వచ్చిందని’ తెలిపింది.

డైరెక్టర్ శివని ఈ సినిమా ఎలా మొదలైంది? అని అడిగితే ‘ నేను నా మొదటి సినిమా కోసం వేరే కథని అనుకున్నాను. కానీ నిర్మాతలు లవ్ స్టొరీ వైపు అడుగేయడంతో ఈ కథ చేసాను. ఇది ఒక సాఫ్ట్ లవ్ స్టొరీ. ఇందులో ఇన్నర్ గా అమ్మాయిలకి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అనే ఒక మెసేజ్ ఉంటుంది. సినిమా చాలా ఫ్రెష్ ఫీల్ తో ఉంటుందని’ అన్నాడు.

మాస్ ఇమేజ్ ఉన్న నవీన్ చంద్రని హీరోగా మరియు రీతు వర్మలను ఎలా ఎంచుకున్నారు? అని అడిగితే ‘ఈ సినిమా కథ అనుకున్న తర్వాత హీరో కోసం ఎతుకుతున్న సమయంలో ‘అందాల రాక్షసి’ సినిమా విడుదలైంది. అందులో నవీన్ చంద్ర పెర్ఫార్మన్స్ బాగా నచ్చింది. ఎంతో ఈజ్ తో చేసాడు. అతన్ని అడిగితే నాకు ఇప్పటి వరకూ కాస్త రఫ్ లుక్ ఉన్న పాత్రలే వచ్చాయి, ఇదేమో స్టైలిష్, మోడ్రన్ అంటున్నారు. ఇది నాకు సెట్ అవుతుందా అని అడిగాడు కానీ నేనే చేయగలరని చెబితే ఎంతో చాలెంజింగ్ గా తీసుకొని తన లుక్ మొత్తాన్ని మార్చుకొని ఈ సినిమా చేసాడు.

ఇక రీతు వర్మని ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిల్మ్ చూసి ఎంపిక చేసాను. హీరోయిన్ కి చాలా ప్రాధాన్యత ఉంది. నేను అనుకున్న పాత్రకి తను పూర్తిగా జస్టిఫికేషన్ చేసిందని’ అన్నాడు.

సినిమాకి హైలైట్స్ ఏమవుతాయి. అలాగే మూవీలో మీ గురువు పూరి గారి మార్క్ ఉంటుందా? అని అడిగితే ‘ ఈ మూవీకి మెయిన్ హైలైట్ స్టొరీ లైన్. బిందు పాత్ర, సినిమాటోగ్రఫీ హైలైట్స్ అవుతాయి. నేను పూరి గారి శిష్యున్ని అయినా ఈ సినిమాలో పూరి గారి మార్క్ కనిపించదు. కానీ ఈ సినిమాలో ఒక్క ఫైట్ ఉంటుంది. అది మాత్రం ఆయన స్టైల్లో ఉండే అవకాశం ఉందని’ అన్నాడు.

తాజా వార్తలు