ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్-మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బాబు పి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమాకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
ఈ టైటిల్ కి చాలా మీనింగ్ ఉంది. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2002 టైం లో జరుగుతుంది. అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి అలా పెట్టడం జరిగింది. కన్నడలో కూడా ఈ సినిమాని అదే టైటిల్తో రిలీజ్ చేస్తున్నాం.
ఆంధ్ర కింగ్ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర గారిని తీసుకోవడానికి కారణం?
రానా గారు ఉపేంద్ర గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం చూశాను. అందులో ఉపేంద్ర గారు ‘నేను బయటకంటే సినిమాలోనే రియల్ మనిషి’ అని చెప్పారు. ఆ మాట నాకు చాలా కనెక్ట్ అయింది. అప్పుడే సూర్య అనే క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనిపించింది. సూర్య పాత్ర కోసం మేము ఆయన్నే సంప్రదించాము. ఉపేంద్ర గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సూర్యలో అందరు స్టార్స్ కనిపిస్తారు. ఉపేంద్ర గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన్ని కలిసిన తర్వాత ఆయన గురించి మరింత తెలుసుకున్నాను.
ఈ కథ రామ్ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏమిటి?
మైత్రి మూవీ మేకర్స్ కి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. రామ్ గారు అప్పటికే చాలా పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. నేను ఒక సినిమా మాత్రమే చేసిన దర్శకుడిని. ఆయన కాల్ చేసి 20 నిమిషాల్లో కథ చెప్పగలవా అని అన్నారు. నేను అప్పటికే పూర్తి కథని రాసుకున్నాను. ఆయనకి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని రాత్రంతా ఆలోచించాను. ఆయనకి కలిసి కథ చెప్పాను. పూర్తి కథ విన్నారు. తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుంచి నాకు కాల్ వచ్చింది. ‘ఆయన ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేసిన కథ ఇదే’ అని చెప్పారు.
భాగ్యశ్రీ గారి పాత్ర ఎలా ఉంటుంది?
భాగ్యశ్రీ గారి పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. మురళీ శర్మగారు ,రావు రమేష్ గారు సత్య, రాహుల్ రామకృష్ణ ఇలా ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ ఒక ఎమోషన్ తో ఉంటుంది.
ఈ సినిమా మ్యూజిక్ గురించి?
వివేక్ మెర్విన్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. వాళ్ల ద్వారా ప్రేక్షకుల నుంచి మరింత అటెన్షన్ వచ్చింది. సినిమాలో మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
మైత్రి మూవీ మేకర్స్ గురించి ?
మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ కథకు కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. చాలా ఫ్యాషన్ అన్న నిర్మాతలు.
మీ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమిటి?
కొన్ని కథలు ఉన్నాయి. చర్చిస్తున్నాము. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటి మీద వర్క్ చేస్తాను
