లవర్ బాయ్ సిద్దార్థ్ హీరోగా, అందాల భామ అమలా పాల్ కథానాయికగా వచ్చిన చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన బాలాజీ మోహన్ తన చిన్ననాటి స్నేహితురాలైన అరుణని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ మహోత్సవం చెన్నై లో కన్నుల పండుగగా జరిగింది. మీరు పైన చూస్తున్న ఫోటో వారి వివాహ మహోత్సవం లోనిదే. బాలాజీ మోహన్ తీసిన ‘లవ్ ఫెయిల్యూర్’ తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో బాలాజీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలాజీ ప్రస్తుతం తన మొదటి చిత్రాన్ని నిర్మించిన వై నాట్ స్టూడియోస్ బ్యానర్ లోనే మరో చిత్రాన్ని తీయడానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్ర పూర్తి విశేషాలను త్వరలోనే తెలియజేయనున్నారు.