“దిల్”రాజుకు ఆ దర్శకునిపై అంత నమ్మకం ఉందా?

“దిల్”రాజుకు ఆ దర్శకునిపై అంత నమ్మకం ఉందా?

Published on May 13, 2020 3:00 AM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతలలో “దిల్” రాజు కూడా ఒకరు. తాను ఇప్పటి వరకు టాలీవుడ్ దాదాపు అందరి హీరోలతోనూ సినిమాలు చేసి కవర్ చేసేసారు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే అని పలు మార్లు ప్రస్తావించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణుకు అప్పగించారు.

అయితే శ్రీరామ్ వేణుపై ఎంత నమ్మకం లేకపోతే పవన్ లాంటి స్టార్ హీరోతో ఒక కం బ్యాక్ ప్రాజెక్ట్ ను అప్పగిస్తారు?ఇప్పుడు ఆ నమ్మకం నిజమేనా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎందుకంటే ఇదే దర్శకునితో మళ్ళీ మరో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. అందులోను ప్రభాస్ తో అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు