దిల్ రాజు ‘గబ్బర్ సింగ్’ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా

దిల్ రాజు ‘గబ్బర్ సింగ్’ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా

Published on Feb 4, 2020 10:03 AM IST

పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ఈ తేదీ వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. అదే ‘గబ్బర్ సింగ్’. ఈ చిత్రాన్ని అంతా పవన్ కమ్ బ్యాక్ మూవీ అంటుంటారు. ఇది మే 11న విడుదలై ఇండస్ట్రీ హిట్ అయింది.

అందుకే దిల్ రాజు పవన్ రీఎంట్రీ చిత్రాన్ని కూడా అదే నెలలో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మే 15ను విడుదల తేదీగా నిర్ణయించారట. ఆయన మే నెల నమ్మకం ఫలించి చిత్రం హిట్ అవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఉగాది రోజున రివీల్ చేయనున్నారు.

తాజా వార్తలు