హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “అందాల రాక్షసి” పరిశ్రమలో చాలా మందిని ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. “ఈగ” చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ఆడియో విడుదల జరిగినప్పటి నుండి ఈ చిత్ర హక్కులను కొనడానికి పలువురు డిస్ట్రిబ్యుటర్స్ పోటీ పడ్డారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర డిస్ట్రిబ్యుషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ హక్కుల కోసమై ఈయన 3.75 కోట్లు చెల్లించినట్టు తెలుస్తుంది. నూతన నటీనటులను పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం చాలా మంచి ధర పలికింది. నవీన్ చంద్ర,రాహుల్ రవీంద్రన్ మరియు లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా మురళి జి ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం 1991లో జరిగిన త్రికోణ ప్రేమకథగా ఉంటుంది. ఈ నెలలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.