ఇది మీకు తెలుసా? పవన్ దర్శకత్వంలో రావాల్సిన ఓ ఇంట్రెస్టింగ్ సినిమా కోసం

టాలీవుడ్ లో ఉన్నటువంటి పలువురు మల్టీటాలెంటెడ్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఒక్క నటుడు గానే కాకుండగా చాలా అంశాల్లో పవన్ కి మంచి టాలెంట్ ఉంది. అలాంటి వాటిలో తాను దర్శకుడు కూడా అని అందరికీ తెలిసిందే. తాను దర్శకత్వంలో చేసిన జానీ చిత్రానికి ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.

అప్పట్లో వచ్చిన సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు కానీ ఇపుడు రీరిలీజ్ చేస్తే మాత్రం మంచి వసూళ్లు అందుకునే పొటెన్షియల్ ఉన్న ప్లాప్ క్లాసిక్స్ లో ఇది ఒకటి. అయితే పవన్ ఆ సినిమా తర్వాత దర్శకత్వానికి దూరంగానే ఉన్నారు. కానీ ఆ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ కి మాత్రం కథ, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది.

కానీ ఇది మీకు తెలుసా? ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుని పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహిద్దాం అనుకున్నారట. అది కూడా జానీ సమయంలోనే అట. ఆ సినిమా కంప్లీట్ గా అడవి మృగాలా నేపథ్యంలో పవన్ ప్లాన్ చేసుకున్నారట. అందుకోసం నిజమైన జంతువులనే తీసుకోవాలని కూడా అనుకున్నారట.

అందులో భాగంగానే కొన్ని పులి పిల్లలు ఇతర జంతువులపై రీసెర్చ్ కూడా చేసారని అప్పట్లో రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ ఆ సినిమా అలా ఆగిపోయింది. మరి పవన్ ఆనిమల్స్ బ్యాక్ డ్రాప్ లో ఎలాంటి సినిమా అనుకున్నారో కానీ తెరకెక్కించి ఉంటే తన నుంచి మరో కొత్త రకం సినిమా వచ్చి ఉండేది ఏమో.

Exit mobile version