ట్విట్టర్ అకౌంట్ ని తొలగించిన రామ్ చరణ్.!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన ట్విట్టర్ అకౌంట్ ని తొలగించారా? ప్రస్తుత సమాచారం ప్రకారం ఔననే అంటున్నాయి ట్విట్టర్ వర్గాలు. రామ్ చరణ్ ట్విట్టర్లో @alwayscharan అనే అకౌంట్ పేరుతో ట్వీట్స్ చేసేవారు, ఏమైందో ఏమో ఆకష్మాత్తుగా ఆ అకౌంట్ ట్విట్టర్లో కనపడటం లేదు. ఇది చూసిన రామ్ చరణ్ సన్నిహితులు మరియు అతన్ని ఫాలో అయ్యే ఫాలోయర్స్ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది చూస్తుంటే రామ్ చరణ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఇలా చేసినట్లుగా ఉంది. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ యువ హీరో తన పెళ్లి మరియు తన కెరీర్ విశేషాల్ని ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ద్వారా అందించారు. ఈ అకౌంట్ ని రామ్ చరణ్ తన ఇష్టానుసారమే తొలగించారా లేక అనుకోకుండా జరిగిందా? అనేది ఇంకా తెలియలేదు. ఆ విషయం కనుక్కొనే పనిలోనే ఉన్నాము, దీని గురించి పూర్తి సమాచారాన్ని అతిత్వరలోనే మీకందిస్తాము.

Exit mobile version