ధృవ్ “బైసన్” ఓటీటీ రిలీజ్ ఆ రోజే !

Bison

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “బైసన్”. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన రూరల్ అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఐతే, ఈ చిత్రానికి తమిళనాడులో మంచి ఆదరణ లభించింది, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంత గొప్ప స్పందన రాలేదు. ఐతే, ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ కారణంగా తిరిగి వార్తల్లోకి వచ్చింది. బైసన్ నవంబర్ 21, 2025న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఐతే, ఈ సినిమా కేవలం తమిళం మరియు తెలుగుకే పరిమితం కాకుండా.. అటు హిందీ, కన్నడ మరియు మలయాళంలో కూడా విడుదల అవుతుండటం విశేషం. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రజిష విజయన్ లు హీరోయిన్స్ గా నటించగా సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా రంజిత్, అదితి ఆనంద్ లు నిర్మాణం వహించారు. ఏదిఏమైనా ఈ సినిమాతో ధృవ్ 70 కోట్ల క్లబ్ లో చేరాడు.

Exit mobile version