రికార్డులు సృష్టిస్తున్న ధూమ్ 3

రికార్డులు సృష్టిస్తున్న ధూమ్ 3

Published on Dec 23, 2013 7:30 PM IST

Dhoom3
ఆమీర్ ఖాన్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ధూమ్ 3’ ట్రేడ్ పండితుల మతులు పోగొట్టే కలక్షన్లను సాధిస్తుంది. శెలవు కాని రోజులో విడుదలై మొదటిరోజే 36కోట్లు సాధించి రికార్డులలో నిలిచింది. అంతేకాక కేవలం 3రోజులలోనే 100కోట్లు సాధించి, గతంలో నాలుగు రోజుల హృతిక్ ‘క్రిష్ 3’ రికార్డును బద్దలుకొట్టింది

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఈ సినిమా వసూళ్ళు కూడా బాగున్నాయి. అనువాద సినిమాల వసూళ్ళలో ఈ చిత్రనిదే రికార్డు అని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా ఇండియాలో 107. 61 కోట్లను సంపాదించింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్, సినిమా విడుదలైన థియేటర్ల సంఖ్య(4500) వల్లే ఈ వసూళ్ళు సాధ్యపడ్డాయి. అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఈ సినిమా ఓవర్ సీస్ లో దాదాపు 63కోట్లు సంపాదించింది

బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ పండితుడు తరన్ ఆదర్శ్ ప్రకారం అమెరికా లో ఈ వారంతరం వసూళ్ళలో టాప్ 10 లో ఉన్న మొట్టమొదటి ఇండియన్ సినిమా ధూమ్ 3. అంటే ఇండియా, అమెరికా కలిపి మొత్తం 170.56 కోట్లన్నమాట. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మాణంలో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాల తెరానుభందంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది

తాజా వార్తలు