నేడు దేనికయినా రెడి లోగో ఆవిష్కరణ

విష్ణు మంచు రాబోతున్న చిత్రం “దేనికయినా రెడీ” అక్టోబర్లో భారీ విడుదలకు సిద్దమయ్యింది. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంచు విష్ణు మరియు హన్సిక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర లోగో ఈరోజు “గాంధర్వ మహల్(ఊ కొడతారా ఉలిక్కి పడతార సెట్)” లో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు హాజరుకానున్నారు.. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ మధ్యనే రెండు పాటలను థాయ్ ల్యాండ్ లో చిత్రీకరించారు. ఈ చిత్రం మీద విష్ణు చాలా ధీమాగా ఉన్నారు. కోన వెంకట్ మరియు గోపీమోహన్ ఈ చిత్రానికి కథ అందించగా చక్రి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మీద విష్ణు నిర్మించారు. మంచు విష్ణు చివరగా 2010 లో “వస్తాడు నా రాజు ” చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదిస్తుందని ధీమాగా ఉన్నారు.

Exit mobile version