యూరప్ లో చివరి షెడ్యూల్ జరుపుకోనున్న దేనికయినా రెడీ

యూరప్ లో చివరి షెడ్యూల్ జరుపుకోనున్న దేనికయినా రెడీ

Published on Aug 30, 2012 6:43 PM IST


మంచు విష్ణు, హన్సిక ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “దేనికయినా రెడి” రెండు పాటల మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో పాట చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టాకీ మొత్తం పూర్తయిపోయింది మిగిలిన ఆ ఒక్క పాటని సెప్టెంబర్ లో యూరప్లో చిత్రీకరించనున్నారు. “ఢీ” చిత్రం తరువాత విష్ణు విజయం రుచి చూడలేదు ఈ చిత్రం విజయం సాదిస్తుందని విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం కామెడి ప్రధాన ఆకర్షణగా నిలువనుందని అంటున్నారు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ లు ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది. తరువాత రావణుడి పాత్రలో మోహన్ బాబు గారితో విష్ణు “రావణ బ్రహ్మ” అనే చిత్ర పనులను ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు