ఆకట్టుకుంటున్న ‘యముడు’ మూవీ నుంచి ‘ధర్మో రక్షతి’ పాట

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు. భవానీ రాకేష్ అందించిన బాణి ఆకట్టుకునేలా ఉంది. యముడి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని చాటి చెప్పేలా సాగిన ఈ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌ కానుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసిన ‘యముడు’ చిత్ర యూనిట్ త్వరలోనే ఓ మంచి రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇకపై ‘యముడు’ నుంచి కంటిన్యూగా అప్డేట్లు ఉంటాయని మేకర్లు తెలిపారు.

Exit mobile version