ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బిజినెస్ మేన్’ వచ్చే వారంలో భారీగా విడుధలవబోతుంది. ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాకు తెలిసాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈ చిత్రంలో విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా చిత్రీకరించారని సమాచారం. పూరి జగన్నాధ్ డైరెక్ట్ ఈ చిత్రానికి డాక్టర్ ఆర్.ఆర్ వెంకట్ నిర్మాత. కాజల్ అగర్వాల్ హీరోయినే కాగా తమన్ సంగీతం అందించిన ఆల్బంలో ‘సారోస్తరోస్తారా’ పాట ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.