బన్నీ సినిమాకి డబ్బింగ్ చెబుతున్న ధర్మవరపు

బన్నీ సినిమాకి డబ్బింగ్ చెబుతున్న ధర్మవరపు

Published on Mar 22, 2012 4:16 PM IST


పాపులర్ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి డబ్బింగ్ చెప్పడం ప్రారంబించాడు. బ్రహ్మానందం మరియు ధర్మవరపు ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించబోతున్నారు. ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం జూన్లో విడుదలకు సిద్ధమవుతుంది. అల్లు అర్జున్ సరసన ఇలియానా నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య సమర్పిస్తుండగా ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సోనుసూద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజా వార్తలు