సమీక్ష : కుబేర – గుడ్ ఎమోషన్ తో సాగే సోషల్ డ్రామా !

సమీక్ష : కుబేర – గుడ్ ఎమోషన్ తో సాగే సోషల్ డ్రామా !

Published on Jun 21, 2025 2:04 AM IST

Kubera Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 20, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, కల్నల్ రవి శర్మ, సునయన తదితరులు
దర్శకుడు : శేఖర్ కమ్ముల
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ధనుష్ – నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

దీపక్ (నాగార్జున) నిజాయితీగల ఒక సీబీఐ అధికారి. అయితే, తన నిజాయితీ కారణంగా కొంతమంది వ్యక్తులు పెట్టిన తప్పుడు కేసులతో జైలులో ఉంటాడు. తాను నమ్ముకున్న న్యాయం దీపక్ కు జరగదు. మరోవైపు నీరజ్ మిత్ర (జిమ్ సర్భ్) ఒక పెద్ద పారిశ్రామికవేత్త. దేశానికి 15 ఏళ్ల పాటు సరిపడే చమురు నిల్వలు దొర్కుతాయి. మంత్రితో రహస్య ఒప్పందం చేసుకుని, ఆ చమురు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ కి ఒక్క దీపక్ మాత్రమే కరెక్ట్ అని జైలు నుంచి దీపక్ ను బయటకు తెస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నాలుగు బినామీ ఖాతాలలో రూ.1 లక్ష కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ నలుగురు బెగ్గర్స్ లో దేవ (ధనుష్) ఒకడు. మరి దీపక్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా ?, ఇంతకీ, దేవ పాత్ర ఏమిటి ?, గతంలో దేవాకి – దీపక్ కు మధ్య సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్. :

ధనవంతుడు-పేదవాడు అనే కాన్సెప్టుతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, ఈ కుబేర సినిమాలో ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. జీవితంలో తనకేమీ అక్కరలేదనుకునే ఒక బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకుని జైలు పాలు అయినా మరో నిజాయితీ పరుడు.. వీరిద్దరి మధ్య డబ్బే ఊపిరిలా బ్రతికే ఓ బిజినెస్ మెన్.. మొత్తానికి ఈ పాత్రల మధ్య డ్రామాతో శేఖర్ కమ్ముల ఆకట్టుకున్నాడు. తన మార్క్ స్క్రీన్ ప్లేను జోడించి ఈ సినిమాని స్పెషల్ మూవీగా మార్చేశాడు శేఖర్ కమ్ముల.

ఇక నటీనటుల విషయానికి వస్తే నాగార్జున తన పాత్రలో ఒదిగిపోయారు. నిజాయితీగా బతకాలనుకుని.. తప్పుడు వ్యక్తుల వైపు నిలబడే సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నాగ్ కనిపించారు. ఆయన కెరీర్‌లో ఇది నిలిచిపోయే క్యారక్టర్ అవుతుంది. క్యారెక్టర్ ముగింపు కూడా ఎమోషనల్ గా బాగుంది. బెగ్గర్‌గా కనిపించిన ధనుష్ తన నటనతో ఆడియెన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. దేవ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించలేం. ధనుష్ నటన ఆ స్థాయిలో ఉంది. హీరోయిన్ గా రష్మిక మందన్నా మరోసారి అద్భుతమైన నటనను కనబరిచింది. తన స్క్రీన్ ప్రజెన్స్‌తో కూడా ఆమె మెప్పించింది.

విలన్ గా జిమ్ సర్బ్ పెఫ్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అలాగే దలీప్ తాహిల్, కల్నల్ రవి శర్మ, సునయనలతో పాటు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఇక లక్ష కోట్ల స్కాం కథ…బాగా డబ్బున్న వాళ్ళకి, ఏమి లేని వాళ్ళకి మధ్య జరిగిన ఈ డ్రామాలో ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. శేఖర్ కమ్ముల పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.

మైనస్ పాయింట్స్ :

బరువైన ఎమోషన్స్ తో వచ్చిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కుబేర చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక నాగార్జున – విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ, కొన్నిచోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

సోషల్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘కుబేర’లో.. గుడ్ సోషల్ మెసేజ్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ధనుష్ – నాగార్జున తమ పవర్ ఫుల్ నటనతో, శేఖర్ కమ్ముల తన దర్శకత్వంతో చాలా బాగా ఆకట్టుకున్నారు. మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ, కొన్ని సన్నివేశాలు రోటీన్ గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఐతే, ధనుష్ తన నటనతో, నాగార్జున తన ఇమేజ్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు