యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ దమ్ములో విజువల్స్ కనువిందు చేయనున్నాయి. ఈ విజువల్స్ కోసం టీం మొత్తం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్ర, తులసి, సింహా వంటి హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఆర్థర్ ఎ విల్సన్ దమ్ము సినిమాకి కూడా సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. మాస్ అభిమానులకు ఎమ్ కోరుకుంటారో అవి అందించటంలో విల్సన్ దిట్ట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ వారంలోనే సెన్సార్ కూడా జరుపుకోనుంది.