‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్లో హై బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ‘ఢమరుకం’ ఈ నెల 23న గ్రాండ్ గా విడుదలవ్వడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాకి ఓవర్సీస్ ప్రింట్స్ ఈ రోజు రాత్రికి ఎయిర్ ఇండియా ద్వారా వెళ్లనున్నాయి. యు.ఎస్ కి సంబందించిన 32 డిజిటల్ ప్రింట్స్ మరియు 8 సాధారణ ప్రింట్స్ ఇందులో వెళ్లనున్నాయి. అనుకున్న టైం కి ప్రింట్స్ బయలుదేరితే యు.ఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రీమియర్ షోలు వేసే అవకాశం ఉంటుంది. అక్కడి సినీ ప్రేమికులకు లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ని అడిగి ఈ చిత్ర షెడ్యూల్స్ తెలుసుకోమని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలియజేసింది.
‘ఢమరుకం’ చుట్టూ ఉన్న చిక్కుముడులన్నీ ఈ రోజుతో తొలగిపోవడంతో మళ్ళీ ఈ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. చాలా సార్లు వాయిదా పడడంతో ఈ చిత్రంపై కొంత నెగటివ్ టాక్ వచ్చింది, ఆ టాక్ ని తుడిచేసి ‘ఢమరుకం’ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకుంటుందని ఆశిద్దాం.