తెలుగు ప్రేక్షకుడికి దేవి శ్రీ ఎనర్జీ ని ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు వేదిక మీదకి వచ్చి ఒక ప్రదర్శన ఇచ్చిన ప్రేక్షకుడు ఉర్రూతలూగిపోవల్సిందే. గతంలో హైదరాబాద్ మరియు చెన్నైలలో చాలా ప్రదర్శనలు ఇచ్చారు.కాని మొట్టమొదటిసారిగా అయన బెంగుళూరులో ప్రదర్శన ఇవ్వనున్నారు. “బెంగుళూరులో ప్రదర్శన ఇవ్వడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది 21వ తారీఖు నేషనల్ గ్రౌండ్స్ 6:30కి నా ప్రదర్శన మొదలవుతుంది” అని ట్వీట్ చేశారు. బెంగుళూరు గణేష్ ఉత్సవ్ స్వర్ణోత్సవ సందర్భంగా అయనని ఆహ్వానించారు. ఆసక్తికరంగా ఈ వేడుకలో ఆయన ఇళయరాజా,ఏసుదాస్ మరియు ఇతర గాయకులు శంకర్ మహదేవన్,షాన్ మరియు సోను నిగం వంటి వారితో వేదికను పంచుకోనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం సూర్య రాబోతున్న చిత్రం “సింగం 2” చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదే కాకుండా “అలెక్స్ పాండియన్”,” నాయక్”, “సార్ వస్తారా”, జంజీర్ రీమేక్ మరియు ఇతర చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.