ఓటీటీలో స్ట్రీమింగ్‌కి ‘దేవకీ నందన వాసుదేవ’.. కానీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ రిలీజ్‌కు ముందుకు మంచి హైప్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాకు మహేష్ బాబు ప్రమోషన్ కూడా చేయడంతో ఇది బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 8 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇది హిందీలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. ఒక తెలుగు సినిమా ఇలా హిందీలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం కాసింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది చూడాలి.

అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్‌గా నటించగా దేవ్‌దత్తా నాగే విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథను అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.

Exit mobile version