టీజర్ టాక్ : ‘మయసభ’ – తెలుగు రాజకీయాలను గుర్తుకు చేసే కథ..!

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో పొలిటికల్ కథ సిద్ధంగా ఉంది. అయితే, ఇది వెండితెరపై వచ్చే సినిమా కాదు.. ప్రము ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కి రాబోతున్న ‘మయసభ’ వెబ్ సిరీస్. దర్శకుడు దేవా కట్ట డైరెక్ట్ చేసిన ఈ పొలిటిక్ థ్రిల్లర్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

ఈ టీజర్‌ను చూస్తుంటే మన తెలుగు ప్రజలకు ఎంతో పరిచయం ఉన్న ఇద్దరు రాజకీయ నేతలకు సంబంధించిన కథ ఇది అని అర్థమవుతుంది. ఇద్దరు స్నేహితులు, రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా ఎలా మారారు.. ఆ తర్వాత వారి మధ్య రాజకీయ వైరం ఎలా తయారైంది.. అనే కథతో ఈ సిరీస్‌ను దేవా కట్టా తెరకెక్కించాడు.

ఇక ఈ సిరిస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవా కట్టా మార్క్ డైలాగులు మనకు ఈ టీజర్‌లో వినిపించాయి. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ వెబ్ సిరీస్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ పేర్కొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version