రామ్ ‘రెడ్’కి వాయిదా తప్పదా ?

రామ్ ‘రెడ్’కి వాయిదా తప్పదా ?

Published on Mar 15, 2020 10:01 PM IST

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా ‘రెడ్’. అయితే ప్రస్తుతం కరోనా వ్యాధి కారణంగా తెలంగాణ మరియు ఆంధ్రలో షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది తెలుగు సినిమా. కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ప్రజలు కూడా రద్దీగా ఉండే సినిమా హాల్స్ కు వెళ్లట్లేదు. దాంతో, ఏప్రిల్ 9న విడుదల అవ్వబోతున్న రామ్ ‘రెడ్’ కూడా వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి కరోనా సినిమాలకు కూడా బాగానే నష్టం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

తాజా వార్తలు