రిలీజ్ కి అన్ని అడ్డంకులను తొలగించుకున్న డమరుకం

రిలీజ్ కి అన్ని అడ్డంకులను తొలగించుకున్న డమరుకం

Published on Nov 5, 2012 5:21 PM IST


గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ‘కింగ్’ అక్కినేని నాగార్జున ‘డమరుకం’ అన్ని అవాంతరాలను క్లియర్ చేసుకొని నవంబర్ 9న భారీగా విడుదల చేయనున్నారు. ఇంకా కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా కొద్ది రోజుల్లో క్లియర్ అయిపోతాయి. నాగార్జున కెరీర్లో అత్యధికంగా సుమారు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మన పురాణాల నుంచి కథాంశాన్ని తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

రానా దగ్గుబాటి హీరోగా రానున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా నవంబర్ 16 లేదా 23కి వాయిదా పడే అవకాశం ఉంది. దీనిపై ఖచ్చితమైన సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు