విజయ్ దేవరకొండ ఫేమ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ మూవీ గత ఏడాది ఐదు భాషలలో గ్రాండ్ గా విడుదలైంది. మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు రష్మికల నటన హైలెట్ గా నిలిచింది. కాగా ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వర్షన్ రెండు వారాల క్రితం యూట్యూబ్ లో విడుదలైంది. ఈ చిత్రం అతి తక్కువ సమయంలో 1 వన్ మిలియన్ లైక్స్ మరియు 60 మిలియన్ వ్యూస్ దక్కించుకొంది. తక్కువ సమయంలో ఇంత ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం విజయ్ పాపులారిటీని తెలియజేస్తుంది.
గోల్డ్ మైన్ టెలి ఫిలిమ్స్ ఈ చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులు దక్కించుకోగా వారికి ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక విజయ్ ఇటీవలే పూరి దర్శకత్వంలో చేస్తున్న కొత్త మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ముంబైలో జరిగిన ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకున్నారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు.