ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కోసం మన తెలుగు ఆడియెన్స్ కు స్పెషల్ గా చెప్పనవసరమే లేదు. ఆ మధ్య లాక్ డౌన్ లో మన తెలుగు హీరోల కన్నా వార్నర్ నుంచి వచ్చిన ఎంటర్టైన్మెంట్ పాళ్లే ఎక్కువగా ఉంటాయి. టిక్ టాక్ లో మన స్టార్ హీరోలపై అదిరిపోయే వీడియోలు చేసి ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చాడు. ఇక అలాగే ఆ తర్వాత ఐపీఎల్ లో కూడా క్రికెట్ మరియు తెలుగు ఆడియెన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను మళ్ళీ ఇచ్చాడు.
ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు వార్నర్ కు ప్రత్యేక బంధమే ఉందని చెప్పాలి. ఆ మధ్యన మహేష్ పాటలకు అదరగొట్టిన వార్నర్ తాను కూడా మహేష్ ఫ్యాన్ నే అని చెప్పి మన దగ్గర మిగతా మహేష్ అభిమానులకు ఫుల్ కిక్కిచ్చాడు. ఇప్పుడు అవన్నీ పక్క పెడితే ఈ కొత్త సంవత్సరం గిఫ్ట్ గా మరో గిఫ్ట్ ఇచ్చాడు. మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ “మహర్షి” సినిమా నుంచి రీఫేస్ యాప్ తో తానే ఓ మహర్షిలా కనిపించి షాకిచ్చాడు. కొన్ని షాట్స్ అలాగే డైలాగ్స్ అందులో ఉన్నాయి. మరి మహర్షిలా వార్నర్ ఎలా ఉన్నాడో ఈ వీడియోలో చూసెయ్యండి.