గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపాన్ని మరోసారి చూపెట్టాడు. ఇక ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకే హైలైట్గా నిలిచింది.
ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. స్టార్ మా ఛానల్లో ‘డాకు మహారాజ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టెలికాస్ట్కు రెడీ అయింది. జూలై 13న సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేస్తున్నట్లు స్టార్ మా ప్రకటించింది. దీంతో ఈ సినిమాను బుల్లితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి. మరి బుల్లితెరపై ‘డాకు మహారాజ్’ ఎలాంటి సౌండ్ చేస్తాడో చూడాలి.