తెలుసు కదా.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్..!

తెలుసు కదా.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్..!

Published on Oct 15, 2025 12:03 AM IST

Telusu-Kada

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తెలుసు కదా’ దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను నీరజా కోన డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను నిర్విరామంగా చేస్తున్నారు. అయితే, ఇందులో భాగంగా ఈ చిత్ర గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 15న హైదరాబాద్‌లోని కెఎల్‌హెచ్ యూనివర్సిటీలో సాయంత్రం 5 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో అందాల భామలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు