ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్స్ తో దూసుకెళ్తున్న హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఒకరు. అయితే రష్మిక మందన్నా రీసెంట్ గా చేసిన సినిమాల్లో సికందర్ తప్ప మిగతా అన్నీ కూడా ఒకదాన్ని మించిన ఒకటి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక గత వారమే కుబేర సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాగా ఒక సోలో సినిమా అనౌన్స్ చేసింది.
ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమా తాలూకా టైటిల్ ని రేపు జూన్ 27 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా తెలిపింది. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే ఎదోఏదో పీరియాడిక్ వారియర్ డ్రామాలా అనిపిస్తుంది. మరి దీనిపై మరిన్ని డీటెయిల్ తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని యూనిఫార్ములా ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Can you guess what the title of my next could be? ????
I don’t think anyone can actually guess.. but if at all you can guess it then i promise to come meet you.. ???????? pic.twitter.com/7KPl6UyVJN— Rashmika Mandanna (@iamRashmika) June 26, 2025