‘దిల్ రూబా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

‘దిల్ రూబా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

Published on Mar 10, 2025 9:00 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘దిల్ రూబా’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు విశ్వ కరుణ్ తెరకెక్కించగా, అందాల భామ రుక్సర్ ధిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ ఈవెంట్‌ను మార్చి 11న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ ఈవెంట్‌కు ఎవరెవరు వస్తారనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.

ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారనేది చూడాలి.

తాజా వార్తలు