సిద్దార్ధ్ ను పొగిడేసిన దర్శకరత్న

Dasari-Narayana-Rao-and-Sid
సిద్దార్ధ్, హన్సిక జంటగా నటిస్తున్న ‘సంథింగ్….సంథింగ్’ సినిమా ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా హాజరైన దర్శకరత్న దాసరి నారాయణరావు నిన్న అమితానందంలో వున్నారు. మొత్తం చిత్ర బృందాన్ని అభినందించిన ఆయన ఈ సినిమా దర్శకుడు సుందర్ సి ని తెలుగు సినీరంగంలోకి స్వాగతించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆయన సిద్దార్ధ్ గురించి మాట్లాడిన విధానం. “నాకు వ్యక్తిగతంగా సిద్దార్ద్ అంటే ఇష్టం. అతనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాను. మనకి అతను ఎంత మంచి నటుడో తెలిసినా ఇప్పుడు ఒక మంచి హిట్ అతని స్థాయిని పెంచుతుంది. అతని సినిమా విజయం సాదించాలని కోరుకుంటున్నాని”తెలిపారు. అంతే కాక హన్సికది గోల్డెన్ లెగ్ గా అభివర్ణించారు. ఈ సినిమాకు కుష్బూ నిర్మాత. లక్ష్మి గణపతి ఫిల్మ్స్ నుంచి సుబ్రహ్మణ్యం పంపిణీ చేస్తున్నాడు. సత్య సంగీతం అందించాడు.

Exit mobile version