నేను చేసేవన్నీ మనోజ్ చేస్తున్నాడు – దాసరి

Dasari-Narayana-Rao
మంచు మనోజ్ హీరోగా నటించిన సినిమా ‘పోటుగాడు’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. ఈ వేడుకకి దర్శకరత్న దాసరి నారాయణ రావు, డా. మోహన్ బాబు, నాగ చైతన్య, నాని, అల్లరి నరేష్, సునీల్, తనీష్, సందీప్ కిషన్, విష్ణు, వరుణ్ సందేశ్, చార్మీ, కీరవాణి తదితరులు ఈ వేడుకకి హాజరయ్యారు.

ఈ వేడుకలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘ నేను చిన్నప్పటి నుంచి మోహన్ బాబు పిల్లల్ని చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి మనోజ్ విషయంలోనే వీడు ఏమవుతాడో అనే కాస్త టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడా టెన్షన్ లేదు. ఎందుకంటే మోహన్ బాబు నుంచి విష్ణు నటనని వారసత్వంగా తీసుకుంటే, లక్ష్మీ నటనని, నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంది. మనోజ్ మాత్రం నటననే కాకుండా రైటర్ గా, సింగర్ గా, ఫైట్స్ కంపోజ్ చేయడం ఇలా ఒక్కటేమిటి దాసరి చేయగలిగినవి అన్నీ మనోజ్ చేసేస్తున్నాడని’ అన్నాడు.

Exit mobile version