‘గ్రీకువీరుడు’ సినిమాకుగానూ థమన్ అందించిన సంగీతానికి దర్శకుడు దశరధ్ చాలా సంతృప్తి చెందాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగిసింది. థమన్ కూడా నేపధ్య సంగీత పనులు ముగించాడు. ఆఖరి కాపీ చూసాక అమితానందంతో దశరధ్ తన ట్విట్టర్లో థమన్ ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్లాడని తెలిపారు. ఈ ఏడాది ‘నాయక్’, ‘బాద్ షా’ వంటి భారీ సినిమాలే కాక ‘జబర్దస్త్’ లాంటి ఎంటర్టైనర్ సినిమాలకూ థమన్ మంచి సంగీతాన్ని అందించాడు. దీనికి జతగా తమన్ అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలమని దశరధ్ తెలిపాడు.
నాగార్జున ‘గ్రీకువీరుడిగా’ కనిపించగా అతని సరసన నయనతార నటించింది. మీరా చోప్రా, ఎం.ఎస్ నారాయణ, బ్రహ్మానందం, కె. విశ్వనాద్ ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. “ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ చిత్రం మొదటికాపీ సిద్దమయింది. పాటలకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహిస్తాం . ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని” నిర్మాత తెలిపారు. ఈ సినిమాకి అనిల్ బండారి సినిమాటోగ్రాఫర్.
అతని సంగీతానికి ఉబ్బితబ్బిబ్బయిపోయిన దర్శకుడు
అతని సంగీతానికి ఉబ్బితబ్బిబ్బయిపోయిన దర్శకుడు
Published on Apr 16, 2013 11:02 PM IST
First Posted at 22.45 on Apr 16th
సంబంధిత సమాచారం
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక – గీత రచయిత శ్రీమణి
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి