చెన్నైలో రికార్డ్ కలెక్షన్స్ వైపుగా దూసుకెళుతున్న సూపర్ స్టార్

తమిళనాడులో రజిని దర్బార్ వసూళ్ల సునామి సృష్టిస్తుంది. ముఖ్యంగా చెన్నై సిటీ పరిధిలో దర్బార్ మూవీ వసూళ్ల జోరు కొనసాగుతుంది.ఎంత మంది హీరోలు వచ్చినా రజిని మేనియా కొంచెం కూడా తగ్గలేదని ఈ బాక్సాపీస్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. విడుదలైన ఏడు రోజులలోనే ఈ చిత్రం చెన్నై సిటీ పరిధిలో 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. చెన్నై సిటీలో ఇప్పటికీ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా రజిని 2.0 కొనసాగుతుంది. వరల్డ్ వైడ్ గా దర్బార్ ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటివేసింది. దర్బార్ మూవీతో రజిని మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు.

దర్శకుడు మురుగదాస్ దర్బార్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ముంబై నేపథ్యంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి కథను ఓ రేంజ్ లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో నయనతార రజినీకి హీరోయిన్ గా నటించగా, నివేదా థామస్ కూతురి రోల్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందించారు.

Exit mobile version