దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా “గప్ చుప్ గణేశా” ఫస్ట్ లుక్, ట్రైలర్ ఆవిష్కరణ

వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై కేఎస్ హేమ్రాజ్ నిర్మాణంలో, సూరి ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రోహన్, రిదా జంటగా నటిస్తున్నారు. శ్రీ తరుణ్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని అంగత్ కుమార్ నిర్వహించారు. అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “గప్ చుప్ గణేశా అనే టైటిల్ చాలా బాగుంది. క్యాచీగా ఉంది. ఫస్ట్ లుక్, ట్రైలర్ వినాయక చవితి పండుగ రోజున రిలీజ్ కావడం మంచి శుభారంభం. గతంలో కేఎస్ ఫిలిం వర్క్స్‌పై వచ్చిన రిచ్చిగాడి పెళ్లి సినిమా విజయవంతంగా నడిచింది. ఇప్పుడు హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తుండటం ఆనందంగా ఉంది. ఇటువంటి చిన్న సినిమాలు విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.

నిర్మాత హేమ్రాజ్ మాట్లాడుతూ దామోదర్ ప్రసాద్ గారిపట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. బిజీ షెడ్యూల్ మధ్య తమ ప్రాజెక్ట్‌ను సపోర్ట్ చేయడానికి సమయం కేటాయించడం తమకు పెద్ద ప్రోత్సాహమని అన్నారు. దర్శకుడు సూరి ఎస్ కూడా దామోదర్ ప్రసాద్ గారి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. హీరో రోహన్ మాట్లాడుతూ “మా చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేసి మాకు అండగా నిలిచినందుకు దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ సినిమా కథ ఒక మొహమాటస్తుడైన వ్యక్తి జీవితాన్ని హాస్యపూర్వకంగా చిత్రీకరిస్తుంది. తన మొహమాటం వల్ల అతను ఎదుర్కొనే ఇబ్బందులు, ఉద్యోగం మరియు వ్యక్తిగత జీవితంలో జరిగే సరదా సంఘటనలు ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ట్రైలర్‌లో హీరో క్యారక్టర్ సహజంగా ప్రతి ఒక్కరికి దగ్గరైన వ్యక్తులను గుర్తు చేసేలా ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

Exit mobile version