మళ్ళీ వాయిదా పడ్డ ‘డమరుకం’

మళ్ళీ వాయిదా పడ్డ ‘డమరుకం’

Published on Nov 9, 2012 8:10 PM IST

‘కింగ్’ అక్కినేని నాగార్జున అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు మరో భాదాకరమైన వార్త, ‘డమరుకం’ సినిమా మరో సారి వాయిదా పడింది. రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల కావడం లేదు, మరో సరికొత్త విడుదల తీదీని త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆ థియేటర్లకు వెళ్లి వాల్ల మనీ వెన్నక్కి తీసుకోవాలని ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. నిన్న రాత్రి అధికారికంగా సినిమా నవంబర్ 10న ఖచ్చితంగా వస్తుందని తెలియజేసారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రొడక్షన్ టీం అనుకున్న టైంకి సినిమాని విడుదల చేయడం లేదు.

నాగార్జున మరియు అనుష్క జంటగా నటించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తాజా వార్తలు