మల్టీ స్టారర్ చిత్రాల పరంపరలో మరో వంశం!!!

మల్టీ స్టారర్ చిత్రాల పరంపరలో మరో వంశం!!!

Published on Oct 26, 2013 9:00 AM IST

Daggubati-family-to-work-to
‘మనం’ సినిమాకోసం అక్కినేని వంశంలో మూడు తరాల నటులూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో దగ్గుబాటి వంశం కూడా ఒక సినిమా తెరకెక్కించాలని యోచిస్తున్నారు. రామానాయుడు ప్రాజెక్ట్ కు తగిన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు

రామానాయుడు, వెంకటేష్, రానా మరియు నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన పాత్రలలో నటిస్తారు. ఇందులో సురేష్ బాబు చిన్న కొడుకు అభిరాం ఒక చిన్న పాత్ర పోషిస్తున్నాడట. అన్నీ సజావుగా సినిమా వచ్చే యేడాది మొదటి భాగంలో మొదలుకావచ్చు. ఇది కాక రామానాయుడు రానా, నాగచైతన్యలతో విడివిడిగా రెండు సినిమాలను నిర్మిస్తారు. పంజాబిలో రామానాయుడు నిర్మించిన ‘సింగ్ వెర్సెస్ కౌర్’ సినిమా తెలుగులో నాగ చైతన్యతో రీమేక్ చెయ్యనున్నారు

ప్రస్తుతం రామానాయుడు నిర్మించిన ‘నేనేం చిన్నపిల్లనా’ సినిమా విడుదలకు సిద్దంగావుంది. రాహుల్ మరియు తన్వి వ్యాస్ హీరో, హీరోయిన్స్. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు

తాజా వార్తలు