శింభు మరియు రిచా గంగోపాధ్యాయ్ ప్రదాన పాత్రలలో హిందీ “దబాంగ్” చిత్ర రీమేక్ గా తమిళంలో తెరకెక్కిన “ఒస్తి” చిత్రాన్ని తెలుగులోకి అనువదించనున్నారు. “పోలీస్ టైగర్” అనే పేరుతో తెలుగులో ఈ చిత్రాన్ని ఫైవ్ కలర్ మీడియా బ్యానర్ మీద శ్రీనివాస్ అనువదిస్తున్నారు. ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు ఈ మధ్యనే మొదలయ్యాయి. మల్లికా షెరావత్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక గీతానికి నృత్యం చేశారు ఈ పాట ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ కానుంది అని నిర్మాత తెలిపారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా ధరణి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఇకక్డ “దబాంగ్” చిత్రాన్ని పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” గా రీమేక్ చేసి భారీ విజయాన్ని దక్కించుకున్నారు ఇప్పడు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వాడడం ఎలాంటి ఫలితాన్ని కనబరుస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయ్యనున్నట్టు నిర్మాత తెలిపారు.