బ్లాక్డ్’ చిత్రం నుండి ‘దాహం తీరనట్టున్నది’ సాంగ్ విడుదల..!

మనోజ్ నందం హీరోగా శ్వేత సాలూరు హీరోయిన్ గా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో రామారావు లెంక‌, ప‌ద్మ లెంక సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ `బ్లాక్డ్‌`. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘దాహం తీరనంటోన్నది.. నీ స్నేహం కోరుకుంటున్నది’ పాటని ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు పద్మ లెంక, రామారావు లెంక మాట్లాడుతూ…”రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రేక్షకులను అబ్బుర పరిచే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అలాగే హార‌ర్ కామెడీ అంద‌రినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన లభించింది. ఆర్టిస్టులు కొత్తవారైనా బాగా చేశారు. సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సినిమాలోని అన్ని పాట‌లు త‌ప్ప‌కుండా ప్రేక్షకులను అల‌రిస్తాయి.. అని తెలిపారు.

చిత్ర దర్శకుడు రామ్ లొడగల మాట్లాడుతూ.. ” హార్రర్ రొమాంటిక్ కామెడీతో రూపొందిస్తున్న “బ్లాక్డ్” చిత్రం ఆడియెన్స్ ని తప్పకుండా అలరిస్తుంది. మా నిర్మాతలు పద్మ, రామారావు లెంక గారు ఖర్చుకు వెనకాడకుండా అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు వచ్చిన హార్రర్ చిత్రాల్లో కంటే మా చిత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదే మాట ప్రేక్షకులు సినిమా చూసి ముక్తకంటంతో చెపుతారు అనే నమ్మకముంది. ప్రదీప్ చంద్ర మంచి ట్యూన్స్ తో పాటు రీ-రికార్డింగ్ అత్యద్భుతంగా చేసాడు. దాహం తీరనట్టున్నది పాటని రిలీజ్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version