‘డి ఫర్ దోపిడి’ సినిమాకు విడుదలకు ముందే పాజిటివ్ టాక్

bisket-and-d-for-dopidi
సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ నటించిన ‘డి ఫర్ దోపిడి’ సినిమా ప్రస్తుతం విడుదలకు ముందు పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. ఇటీవలే వైజాగ్ లో ఒక మల్టీ ప్లెక్స్ లో ఈ సినిమాను ప్రదర్శించగా ప్రేక్షకుల స్పందన చూసి చిత్రబృందం ఆశ్చర్యపోయారు. ఈ సినిమాను చూసిన వాళ్ళు స్క్రిప్ట్ మరియు నటీనటుల ప్రదర్శన బాగుందని తెలిపారు. వైజాగ్ లో ప్రదర్శన తరువాత డిసెంబర్ 22న విజయవాడలో మరియు డిసెంబర్ 24న హైదరాబాద్ లో స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు

ఈ సినిమాకు సిరాజ్ కల్లా దర్శకుడు. బ్యాంక్ ను దొంగతనం చెయ్యాలనుకున్న నేపధ్యంలో పుట్టే కామెడీతో సినిమాను తీశారు. నవీన్, రాకేష్ మరియు మెలానీ ముఖ్యపాత్రధారులు. రాజ్ మరియు డి.కె నిర్మాతలు. నాని సహనిర్మాత. దిల్ రాజు పంపిణీదారుడు

మహేశ్ శంకర్, సచిన్ జీగార్ లు సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 25న ఈ సినిమా విడుదలకానుంది

Exit mobile version