డిసెంబర్ 3న డి ఫర్ దోపిడీ ఫస్ట్ లుక్


సందీప్ కిషన్ మరియు వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలలో రానున్న “డి ఫర్ దోపిడీ” చిత్ర ఫస్ట్ లుక్ డిసెంబర్ 3న విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది ఈ వారాంతం హైదరాబాద్లో ఒక పాట చిత్రీకరణ జరుపుకోనుంది. మెలనీ కన్నోకడ ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కనుంది ఈ రకమయిన చిత్రం తెలుగులో రావడం ఇదే మొదటిసారి. గతంలో “ఫ్లేవర్స్”,”99″ మరియు “షోర్ అండ్ ది సిటీ” చిత్రాలను నిర్మించిన రాజ్ నిమదోరు మరియు కృష్ణ డికే ఈ చిత్రాన్ని మొదటిసారిగా తెలుగులో నిర్మిస్తున్నారు. సిరాజ్ కల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సీత మీనన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version