సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేసృకున్నాయి. ఈ సినిమాకి సంబందించిన ఓ ఆసక్తి కరమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ సినిమా రన్ టైంని ఫైనల్ చేసారు. మొత్తంగా ఈ సినిమా నిడివి 2 గంటల 20నిమిషాలు. మాకు అందిన సమాచారం ప్రకారం సినిమా చాలా వేగంగా సాగుతుందని, అలాగే అది సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు.
మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకి సంబందించిన అన్ని రకాల రైట్స్ ని ఈరోస్ ఇంటర్నేషనల్ వారు భారీ మొత్తానికి కొనుగోలుచేసారు.