ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న కన్నడ చిత్రం కాంతార చాప్టర్ 1 కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ సినీ ప్రముఖులు మాట్లాడుతుండగా లేటెస్ట్ గా మన ఇండియన్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ కూడా స్పందించడం వైరల్ గా మారింది0.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చూడడం జరిగింది అని మరోసారి రిషబ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ తో నా మతి పోయింది అని మంగుళూరు ప్రజలు నమ్మకాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు అంటూ ఈ కన్నడ క్రికెటర్ రివ్యూ అందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కే ఎల్ రాహుల్ కూడా కర్ణాటకకి చెందిన వాడే అని చాలా తక్కువమందికే తెలిసి ఉండొచ్చు.