తమిళ స్టార్ హీరో సూర్య – వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. సూర్య పాత్రలో రెండు కోణాలు ఉంటాయని, పైగా సూర్య నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని.. సూర్య పాత్ర కోసం వెంకీ అట్లూరి ప్రత్యేకమైన లుక్ ను కూడా డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట.
అన్నట్టు ఇప్పటికే, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్ నడిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.