సమంత సినిమాలో చైతూ గెస్ట్ రోల్..!

2019 గ్రాండ్ గా ముగించిన సమంత, 2020లో జానుతో పలకరించింది. ఈ చిత్ర ఫలితం ఎలా ఉన్న జానుగా సమంత నటన ప్రశంసలు అందుకుంది. సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారు. గత ఏడాది వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫిక్షనల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఓ బేబీ సూపర్ హిట్ అందుకుంది. సమంత ఆ చిత్రంతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద సోలోగా వన్ మిలియన్ అందుకొని రికార్డ్ సృష్టించింది. రెండు భిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో సమంత ప్రేక్షకులకు మంచి వినోదం పంచింది.

కాగా సమంత తో నందిని రెడ్డి చేయనున్న లేటెస్ట్ మూవీలో హీరో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ఈ క్రేజీ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఓ బేబీ చిత్రంలో కూడా నాగ చైతన్య క్యామియో అప్పీరెన్క్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆయన కొంచెం నిడివి కలిగిన కీలక రోల్ చేస్తున్నారు అని వినిపిస్తుంది. చూడాలి మరి చైతూ సమంత సినిమాలో గెస్ట్ గా కనిపిస్తాడో లేదో..?

Exit mobile version