పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ భారీ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. లాక్ డౌన్ ముందు వరకు నిరవధికంగా షూటింగ్ జరుగగా, తరువాత వాయిదా పడింది. ఇక ఈ చిత్రంలో పవన్ ఓ బందిపోటు పాత్ర చేస్తున్నారు. మూవీ నేపథ్యం మొగలుల కాలం నాటిది. ఈ మూవీలో హీరోయిన్స్ పై ఇప్పటికే కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ పెర్నాండేజ్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్ ఓ హీరోయిన్ గా నటిస్తుందట.
తాజాగా ఈ మూవీలో నటిస్తుందంటూ హీరోయిన్ రకుల్ పేరు తెరపైకి వచ్చింది. రకుల్ ప్రీత్ సైతం ఈ క్రేజీ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. తెలుగులో రకుల్ ప్రీత్ కి పెద్దగా అవకాశాలు లేవు. ఆమె ఫోకస్ కూడా ఎక్కువగా బాలీవుడ్ పైన వుంది. పవన్ తో గతంలో రకుల్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మరి ఇదే కనుక నిజం అయితే ఆమెకు బంపర్ ఆఫర్ దక్కినట్లే.