‘స్పిరిట్’ కోసం మరో స్టార్ హీరోయిన్ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. అయితే, ఈ చిత్రంలో మరో సౌత్ స్టార్ హీరోయిన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. ఇప్పుడన్న సమాచారం ప్రకారం, అనుష్క అయితే బాగుంటుంది అని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడట.సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలోనే ముఖ్యమైన పాత్ర అని, పైగా కథకు అనుగుణంగా వచ్చే ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, ,దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే..ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది.

crazy news on ‘Spirit’ movie

Exit mobile version